కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించింది ఇతనే!

by GSrikanth |   ( Updated:2023-10-27 16:42:03.0  )
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించింది ఇతనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఫస్ట్ లిస్టును ఏఐసీసీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనున్నది. ఫస్ట్ లిస్టులో ఉన్న 5 మందిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.

బీసీలకు 34 సీట్లు కేటాయించాలని, అందులో ముదిరాజ్‌లకు ఐదు సీట్లు, కమ్మ సామాజికవర్గానికి 10, జనరల్ స్థానాల్లోనూ ఐదుగురు ఎస్టీలకు అవకాశం.. ఇలాంటి అనేక డిమాండ్ల అనంతరం వివాదం లేని స్థానాలతో ఫస్ట్ లిస్టును ఏఐసీసీ ప్రకటించింది. సునీల్ కనుగోలు టీమ్ ఫీల్డ్ స్టడీ చేసి రూపొందించిన నివేదిక ఆధారంగా విజయావకాశాలు ఉన్న అభ్యర్థులనే ఏఐసీసీ ఖరారు చేసింది. పార్టీలో సీనియారిటీ ఉన్న నేతలైనా గెలిచే ఛాన్స్ లేకపోవడంతో పక్కన పెట్టింది.

స్క్రీనింగ్ కమిటీ నాలుగుసార్లు సుదీర్ఘంగా అన్ని నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని లిస్టును ఫైనల్ చేసింది. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా పైరవీలకు తావులేని రీతిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్యాండిడేట్లను సెలెక్టు చేసింది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. సిక్స్ గ్యారంటీస్‌తో ప్రజల్లో కాన్ఫిడెన్సు కలిగిందని, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది.

టికెట్ రాలేదనే అసంతృప్తితో పార్టీలో తలెత్తే ఘర్షణలను పరిగణనలోకి తీసుకుని జానారెడ్డి నేతృత్వంలో ఫోర్ మెన్ కమిటీని బుజ్జగింపుల కోసం ఏర్పాటుచేసింది. ఫస్ట్ లిస్టులో టిక్కెట్ రాని నిరాశావహులను బుజ్జగించేందుకు జానారెడ్డి టీమ్ రంగంలోకి దిగనున్నది. అసంతృప్తులను బుజ్జగించడంలో సక్సెస్ అవుతారనే గుర్తింపుతో ఆయనకు ఆ బాధ్యతలను ఏఐసీస అప్పజెప్పింది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన టీమ్‌లోని మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ తదితరులు ఇక్కడే మకాం వేసి నామినేషన్ల టైమ్‌కు కూల్ చేయనున్నారు.

ఈ నెల 18న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానున్నందున ఆ లోపే మిగిలిన అభ్యర్థుల వివరాలను కూడా ఏఐసీసీ వెల్లడించనున్నది.

------------

కాంగ్రెస్ ప్రకటించిన ఫస్ట్ లిస్టులోని స్థానాలు, అభ్యర్థులు వీరే :

ఆదిలాబాద్ జిల్లా :

బెల్లంపల్లి (ఎస్సీ) : గడ్డం వినోద్

మంచిర్యాల : ప్రేమ్‌సాగర్ రావు

నిర్మల్ : శ్రీహరి రావు

నిజామాబాద్ జిల్లా :

ఆర్మూర్ : వినయ్ కుమార్ రెడ్డి

బోధన్ : పి. సుదర్శన్ రెడ్డి

బాల్కొండ : సునీల్ రెడ్డి

కరీంనగర్ జిల్లా :

జగిత్యాల : టి. జీవన్‌రెడ్డి

ధర్మపురి (ఎస్సీ) : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామగుండం : ఎంఎస్ రాజ్‌ఠాకూర్

మంథని : దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

పెద్దపల్లి : సీహెచ్ విజయ రమణారావు

వేములవాడ : ఆది శ్రీనివాస్

మానకొండూర్ (ఎస్సీ) : కవ్వంపల్లి సత్యనారాయణ

మెదక్ జిల్లా :

మెదక్ : మైనంపల్లి రోహిత్

ఆంధోల్ (ఎస్సీ) : సీ. దామోదర రాజనర్సింహ

జహీరాబాద్ (ఎస్సీ) : ఏ. చంద్రశేఖర్

సంగారెడ్డి : తూర్పు జగ్గారెడ్డి

గజ్వేల్ : తూంకుంట నర్సారెడ్డి

రంగారెడ్డి జిల్లా :

మేడ్చల్ : తోటకూర వజ్రేష్ యాదవ్

మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ : కొలన్ హన్మంతరెడ్డి

ఉప్పల్ : ఎం పరమేశ్వర రెడ్డి

చేవెళ్ళ (ఎస్సీ) : పామెన భీమ్ భరత్

పరిగి : టి. రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ (ఎస్సీ) : గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్ జిల్లా :

ముషీరాబాద్ : అంజన్ కుమార్ యాదవ్

మలక్‌‌పేట్ : షేక్ అక్బర్

సనత్‌నగర్ : డాక్టర్ కోట్ నీలిమ

నాంపల్లి : మహ్మద్ ఫిరోజ్‌ఖాన్

కారవాన్ : ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అలీ హాజ్రి

గోషామహల్ : మొగిలి సునీత

చాంద్రాయణగుట్ట : బోయ నగేష్ (నరేష్)

యాకుత్‌పుర : కె. రవిరాజు

బహదూర్‌పుర : పులిపాటి రాజేశ్ కుమార్

సికింద్రాబాద్ : ఆదం సంతోష్ కుమార్

మహబూబ్‌నగర్ జిల్లా :

కొడంగల్ : రేవంత్‌రెడ్డి

గద్వాల : సరితా తిరుపతయ్య

ఆలంపూర్ (ఎస్సీ) : సంపత్ కుమార్

నాగర్‌ర్నూల్ : కూచుకుళ్ళ రాజేశ్‌రెడ్డి

అచ్చంపేట్ : డాక్టర్ వంశీకృష్ణ

కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి

షాద్‌నగర్ : కె. శంకరయ్య

కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు

నల్లగొండ జిల్లా :

నాగార్జునసాగర్ : కె. జై వీర్‌ రెడ్డి

హుజూర్‌నగర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ : నలమాడ పద్మావతి

నల్లగొండ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నకిరేకల్ (ఎస్సీ) : వేముల వీరేశం

ఆలేరు : బీర్ల ఐలయ్య

వరంగల్ జిల్లా :

జనగాం : కొమ్మూరి ప్రతాపరెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) : సింగారపు ఇందిర

నర్సంపేట్ : దొంతి మాధవరెడ్డి

భూపాలపల్లి : గండ్ర సత్యనారాయణ

ములుగు (ఎస్టీ) : ధనసరి అనసూయ (సీతక్క)

ఖమ్మం జిల్లా :

మధిర (ఎస్సీ) : భట్టి విక్రమార్క

భద్రాచలం (ఎస్టీ) : పోడెం వీరయ్య

Advertisement

Next Story

Most Viewed