- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధు విషయంలో EC యూటర్న్‌కు కారణం హరీష్ రావు!
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే సూచించినా ఉల్లంఘించారని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పలానా సమయానికి, పలానా తేదీన రైతుబంధు డబ్బులు పడుతాయని.. ఆ సమయంలో మీ ఫోన్లు టింగ్ టింగ్ అంటాయని ఆయన వ్యాఖ్యానించినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైందని వెల్లడించింది. హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘించారని, అందుకే అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని అని ఈసీ పేర్కొంది. ఈ మేరకు మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది.
కాగా, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి మూడు లేఖలు రాసింది. రైతు రుణమాఫీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు అనుమతి కోసం ఈ లేఖలు రాశారు. అయితే రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డీఏలు విడుదల చేసేందుకు ఈసీ అనుమతించలేదు. కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రైతుబంధు పథకం అమలుకు ఓకే చెప్పింది. ఈనెల 28 వరకల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చునని తెలిపింది. అభ్యంతరాలు రావటంతో తాజాగా.. రైతుబంధు విషయంలో ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది.