- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రవళిక ఇష్యూ.. కేటీఆర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు!
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రేమ వ్యవహారం వల్లే ప్రవళిక సూసైడ్ చేసుకుందని ఇప్పటికే పోలీసులు కన్ఫర్మ్ చేయగా.. ప్రవళిక ఆత్మహత్య పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'ప్రవళిక అసలు గ్రూప్స్ కే అప్లై చేయలేదట.. అది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావుడి చేశాయి' అని మంత్రి కేటీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నిరుద్యోగులు కౌంటర్లు వేస్తున్నారు. ప్రవళిక గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న పేపర్లు, హాల్ టికెట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కేటీఆర్ గారు ఇదిగో ఫ్రూవ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రవళిక విషయంలో అసలు విషయం పక్కదారి పట్టిస్తూ ప్రతిపక్షాలపైనే విమర్శలు చేయడం తగదని మండిపడుతున్నారు. ఓ నిరుద్యోగ యువతి చనిపోతే ఆమె మరణాన్ని సైతం తప్పుడు ప్రకటనలు చేయడమే కాకుండా ఆ యువతి ప్రైవేట్ ఛాటింగ్స్ బయటకు వస్తే ఏం జరుగుతుందంటూ సానుభూతి వ్యాఖ్యలు వల్లించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో ఢిఫెన్స్‌లో బీఆర్ఎస్ :
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రవళిక ఇష్యూ బీఆర్ఎస్‌కు ఛాలెంజింగ్ గా మారింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార బీఆర్ఎస్ కి ప్రవళిక ఆత్మహత్య వ్యహారంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరుకున పెట్టేలా మారింది. కేటీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ... ' ప్రవళిక సూసైడ్ ప్రభుత్వ ఆత్మహత్య అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులేమో ప్రేమ వ్యవహారం వల్లే చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాల ఆరోపణల వల్ల అనివార్య కారణాలతో పోలీసులు ప్రవళిక వాట్సాప్ ప్రైవేట్ ఛాటింగ్స్ విడుదల చేస్తే దీని వల్ల పరువు నష్టం జరిగేది ఎవరికి? వ్యక్తిగత గోపత్య కూడా ముఖ్యం. ఆ అమ్మాయి అసలు గ్రూప్స్ కే అప్లై చేయలేదని అంటున్నారు. ఈ సమాచారాన్ని ఏది కూడా ధృవీకరించుకోకుండానే రాహుల్ గాంధీ, మల్లికార్జు ఖర్గే, మరికొందరు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు.
ఒక అమ్మాయి మరణాన్ని ఇంత దిగజారుడు తనంతో రాజకీయం చేయడం కరెక్టేనా?. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో పోలీసులు చెప్పారు. అది నిజం కాదని రాహుల్ గాంధీ చెప్పగలరా?' అని ప్రశ్నించారు. అయితే ప్రవళిక విషయంలో మీరు నిజానిజాలు ధృవీకరించుకోకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ పై నిరుద్యోగులు మండిపడుతున్నారు. మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రవళిక గ్రూప్స్ కు అప్లై చేసుకున్న విషయాన్ని ఎందుకు ధృవీకరించుకోలేదు. ఇదిగో ఆమె జాబ్స్ కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు అంటూ మండిపడుతున్నారు. పైపెచ్చు ప్రవళిక వాట్సాప్ ప్రైవేట్ చాటింగ్స్ బయటకు వచ్చే ప్రమాదం ఉందంటూ మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు. ఇందతా బీఆర్ఎస్ శవరాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోసమే సమస్యను పక్కదారి:
ఎన్నికల వేళ పెద్దఎత్తున నిరుద్యోగులు రోడెక్కడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసమే బీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా ఇష్యూను డైవర్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడగానే యువతి ఛాటింగ్, ఆమె ఎక్కడ తిరిగిన ప్రదేశాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ల స్వాధీనం చేసుకుని బాయ్ ఫ్రెండ్ మోసం చేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకటన చేసిన పోలీసులు.. మరి ప్రవళిక ఏయో పోస్టులకు అప్లై చేసుకుంది, ఏ జాబ్స్ కోసం పరీక్షలు రాసిందనే విషయాన్ని తెలుసుకోవడంలో ఎందుకు దూకుడుగా వ్యవహరించలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో తమకు నష్టం కలగకుండా బీఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లో పోలీసుల సహకారంతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ప్రవళిక వ్యవహారంలో ప్రతిపక్షాలను ఢిఫిట్ చేసే క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కొంప ముంచేలా ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.