బరితెగించిన BRS MLA అనుచరులు.. మాజీ ఎంపీటీసీపై కర్రలతో దాడి (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-17 14:46:09.0  )
బరితెగించిన BRS MLA అనుచరులు.. మాజీ ఎంపీటీసీపై కర్రలతో దాడి (వీడియో)
X

దిశ, మద్దిరాల: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలని ప్రశ్నించిన దళిత మాజీ మహిళా ఎంపీటీసీపై ఎమ్మెల్యే కిషోర్ అనుచరులు దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. మద్దిరాల మండలంలోని గోరంట్ల గ్రామంలో గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పాల్వాయి కవిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలను సరిగ్గా అమలు చేయాలని, అర్హులకు అందేలా చూడాలని ఎమ్మెల్యేను కిషోర్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.

వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారిని అరెస్ట్ చేశారు. అనంతరం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. అభివృద్ధిపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే ‘‘ఇక్కడ ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి. నన్ను అడిగేది ఇక్కడ కాదు. ఇదేమీ సభ కాదు,’’ అని గ్రామస్తులపై విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story