- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నో డౌట్.. కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు పక్కా’
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ్టితో తెలంగాణలో ప్రచార పర్వం ముగియనుంది. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు సమిష్టి విజయంగానే భావిస్తామని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా తనకు కూడా క్రెడిట్ ఉంటుందంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మీడియా ఛానల్ ప్రతినిథితో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదంటూ జోస్యం చెప్పారు. రైతుబంధుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని.. నవంబర్ 15 లోగా రైతుబంధు ఇవ్వాలని కోరామని తెలిపారు. రైతుబంధు ఆపడం వెనుక తమ పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆపారని దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతుబంధు ఆగిందంటూ కామెంట్స్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ పేర్కొన్నారు.