- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ మీద ఉన్న గౌరవం పోతోంది: షబ్బీర్ అలీ
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కాగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని కేటీఆర్ చేసిన ఆరోపణలపై షబ్బీర్ అలీ శనివారం కౌంటర్ ఇచ్చారు. మైనార్టీ డిక్లరేషన్‌పై ఆయన కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అని, లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసిపోయారన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్ మీద కొంత గౌరవం ఉండేదని.. ఇప్పుడు అది కూడా పోయిందని విమర్శించారు.