- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సభలపై ఫోకస్.. ప్రజల రియాక్షన్‌పై బీఆర్ఎస్ రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటోన్న పబ్లిక్ మీటింగ్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. సభ తరువాత కాంగ్రెస్‌కు ఆ ప్రాంతంలో ఏ మేరకు మైలేజీ వస్తుందోని ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే రేవంత్ స్పీచ్‌కు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? కాంగ్రెస్ హామీలను ప్రస్తావించినప్పుడు రియాక్షన్ ఎలా ఉంది? అనే అంశాలపై నిఘా వర్గాల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ ఉంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీస్ పట్ల కూడా ప్రజలు ఏం అనుకుంటున్నారోనని తెలుసుకుంటున్నట్టు తెలిసింది.
తిట్లను ఎంజాయ్ చేస్తున్న జనం
రేవంత్ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఆ దూషణలు చేస్తున్న సమయంలో సభ నుంచి ఊహించని తీరుగా చప్పట్లు, ఈలలు వేస్తున్నారని, దీంతో రేవంత్ మరింతగా తిట్టేందుకు మొగ్గుచూపుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. ఈ మధ్య సీఎం కేసీఆర్ తన ప్రసంగాల్లో తిట్లను ఉపయోగించడం లేదు. కేవలం తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం అంశాలనే ప్రస్తావిస్తున్నారు.
ధరణి రద్దుపై స్పందన ఏంటి?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణీని రద్దు చేస్తామని ప్రకటించింది. ఇదే అంశాన్ని రేవంత్ తన ప్రచార సభల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ధరణీ రద్దు చేస్తే, రైతుబంధుకు ఎసర వస్తుందని, అవినీతి పెరుగుతుందని, రికార్డుల్లో భూ వివరాలు మాయం అవుతాయని పదే పదే విమర్శలు చేస్తున్నారు. నిజానికి ధరణీ రద్దు గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారోనని తెలుసుకుంటున్నారు. అలాగే రేవంత్ ఒక్కో సభలో ఒక్కో అంశాన్ని హైలెట్ చేస్తూ, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రసంగిండచంపై ఆ పార్టీకి ప్లస్‌గా మారిందని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది.
Read More..
ధరణి పోర్టల్‌లో CM KCR వివరాలే తప్పు..! ఎన్నికల వేళ హాట్‌టాపిక్‌గా మారిన ఇష్యూ