అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం!

by GSrikanth |   ( Updated:2023-06-09 05:41:19.0  )
అనూహ్యంగా వ్యూహం మార్చిన కేసీఆర్.. బలం పుంజుకుంటోదనే భయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ మార్చారు. ఇంతకాలం బీజేపీపై దుమ్మెత్తిపోసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ విధానాలపై, ఆ పార్టీ లీడర్లు ఇచ్చే హామీలపై ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మెల్లగా పుంజుకుంటుదనే సంకేతాలు రావడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కర్నాటక ఎఫెక్ట్

కర్నాటకలో బీజేపీ ఓటమితో గులాబీ అధినేత ఊపిరి పీల్చుకున్నారు. కమలం పార్టీతో ఎలాంటి ముప్పు రాదని సంతోషపడ్డారు. కానీ కాంగ్రెస్ మెల్లగా బలపడుతుందని తెలుసుకుని కంగారు పడుతున్నట్టు ప్రచారంలో ఉంది. అందుకే కొన్ని రోజులుగా కాంగ్రెపై మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈమధ్య నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్ టార్గెట్‌గా మాట్లాడారు. ఇదే పంథాను కొనసాగించాలని ఇతర పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.

బలం పుంజుకుంటోదనే భయం

ఇంతకాలం బీజేపీలోకి వలసలు ఉండగా, కర్నాటక రిజల్ట్ తర్వాత సీన్ మారింది. బీజేపీలోకి చేరేందుకు రెడీ అయిన లీడర్లు ఊగిసలాటలో పడ్డారు. అలాగే బీఆర్ఎస్ కు చెందిన అసంతృప్తి లీడర్లు సైతం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి కర్నాటకలో విజయం సాధించిన తర్వాత ఇక్కడి కాంగ్రెస్ లీడర్లలో కాస్త మనోధైర్యం వచ్చింది. దీనికి తోడు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పై ప్రజల్లో పాజిటివ్ పెరిగిందనే సంకేతాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఇంతకాలం బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు హస్తం పార్టీని ఎదుర్కొనేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. ఆ పార్టీ పట్ల ప్రజల్లో పాజిటివ్ ఓపినియన్ రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పవర్ లోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉండవని, దోపిడీ, అక్రమాలు ఉంటాయని తన ప్రసంగంలో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

బలంగా ఉన్న సెగ్మంట్లపై ఫోకస్

రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్న సెగ్మంట్లు ఎన్ని ఉన్నాయి?అక్కడ ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు?వారికి సెగ్మెంట్ లో సొంతంగా ఉన్న పట్టు ఎంత?అనే వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తుంది. కాంగ్రెస్ గెలిచే చాన్స్ ఉన్న చోట్ల బీఆర్ఎస్ విజయానికి ఏం చేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ను కట్టడి చేసే సత్తా ఉందా?లేక కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలా?అనే అంశాలపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది.

గెలిచే అభ్యర్థులకు ఎర

కాంగ్రెస్ టికెట్‌పై గెలిచే శక్తి ఉన్న అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్న సీఎం కేసీఆర్ వారిని పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ జాబితాలో కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. వారిలో కొందిరితో ఇప్పటికే రాయబేరాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ లీడర్లపై వల విసిరేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: సీఎం సార్‌కు.. సమస్యల సవాళ్లు..

వచ్చే ఎన్నికల్లో పోటీపై MLC కవిత క్లారిటీ.. ఆత్మీయ సభల్లో కేడర్‌కు ఉపదేశం!

Advertisement

Next Story

Most Viewed