Harish Rao Thanneeru :సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

by GSrikanth |   ( Updated:2023-08-17 08:39:47.0  )
Harish Rao Thanneeru  :సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే నాయకులే కావాలి.. ఆడంబరాలకు పోయి హడావుడి చేసే నేతలకు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు సూచించారు. బాలింతల ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఉపయోగపడేలా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 7.50 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed