రజాకార్ మూవీపై సినిమాటోగ్రఫీ మంత్రి సీరియస్.. చిత్రబృందానికి హెచ్చరిక

by GSrikanth |   ( Updated:2023-09-19 06:49:18.0  )
రజాకార్ మూవీపై సినిమాటోగ్రఫీ మంత్రి సీరియస్.. చిత్రబృందానికి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బిల్లును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాడుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల విభజనపై పార్లమెంట్‌ను అవమానించేలా ప్రధాని మోడీ ప్రసంగించారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణపై మోడీ తన అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో గుడ్ గవర్నెన్స్ ఉందని అన్నారు. రెచ్చగొట్టే సినిమాలు ఎవరు తీసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాస్పద చిత్రాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.


కాగా, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసుకొస్తున్న రజాకార్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతున్నది. ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేయగా దీనిపై మంత్రి కేటీఆర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. రజాకార్ మూవీ టీజర్ సమాజంలోని కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని అందువల్ల ఈ సినిమా రిలీజ్‌ను ఆపడం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

అయితే, ఈ ట్వీట్‌కు రియాక్ట్ అయిన కేటీఆర్ 'రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాళా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసులతో కూడా మేము ఈ విషయాన్ని తీసుకుంటాం' అని ట్వీట్ చేశాడు. అనంతరం కేటీఆర్ ట్వీట్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని సెటైర్ వేశారు. ప్రస్తుతం రజాకార్ మూవీపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని పరోక్షంగా స్పందించడం వివాదాస్పదం అయింది.

Read More..

‘రజాకర్’ మూవీపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వాళ్లకు కీలక పిలుపు (వీడియో)

Advertisement

Next Story