BRS ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న యువకులు.. ఉద్రిక్తత (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-16 14:58:36.0  )
BRS ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న యువకులు.. ఉద్రిక్తత (వీడియో)
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తాకింది. గురువారం ఆయన బీబీనగర్ మండలం జెమిలపేట్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు‌. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన‌ కొందరు యువకులు ప్రచారాన్ని అడ్డుకున్నారు. దళిత బంధు, బీసీ బంధు విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారని అన్నారు‌. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేపడుతున్న యువకుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. యువకులు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Advertisement

Next Story