- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ నెల 16న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. మహిళలకు అదిరిపోయే శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు ఏర్పాట్లను ఈసీ షురూ చేసింది. తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించగా.. ఎన్నికల నిర్వహణకు సన్నద్దమవుతోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ముందుగా ఎన్నికల హామీలు ప్రకటించగా.. బీఆర్ఎస్ ఇంకా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే బీఆర్ఎస్ మేనిఫోస్టోను ప్రకటించేందుకు సిద్దమవుతోంది.
అక్టోబర్ 16న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు బుధవారం తెలిపారు. ఇవాళ కొడంగల్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో మహిళలకు వరాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. మహిళలకు శుభవార్తలు రెడీగా ఉన్నాయని, సిద్దంగా ఉండాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ వంటి హామీలను బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.