BRS మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్.. వారికి గుడ్ న్యూస్!

by GSrikanth |   ( Updated:2023-10-15 10:59:44.0  )
BRS మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్.. వారికి గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘మైనార్టీ బడ్జెట్ పెంపు. మైనార్టీ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలుగా మార్పు. ప్రస్తుతం బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కూడా కొనసాగింపు. యువత విదేశీ విద్యకు ప్రోత్సాహం. కుల వృత్తులకు ప్రోత్సాహం కొనసాగింపు. ఈ పథకంతో 90 లక్షల మంది లబ్ధి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేసీఆర్ భీమా పథకం. ఎల్ఐసీ ద్వారా భీమా. తెలంగాణ అన్నపూర్ణ పేరుతో రేషన్ కార్డు వారందరికీ సన్నబియ్యం.’ అందిస్తామని వెల్లడించారు. అంతకుముందు 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫాతరాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామ‌న్నారు.

Advertisement

Next Story

Most Viewed