వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్.. కానీ..

by Javid Pasha |   ( Updated:2023-10-06 15:26:27.0  )
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్.. కానీ..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ నేత, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందని, కానీ అధికారం తమదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ఆయన వ్యాఖ్యానించారు

సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మాల్సిన పనిలేదని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవాళ్లు ప్రజల్లో ఉండాలని బీఎల్ సంతోష్ సూచించారు. అనవసరంగా నేతల చుట్టూ తిరగవద్దని తెలిపారు. టికెట్లపై నిర్ణయం ఢిల్లీలో కాదని, ఇక్కడే ఉంటుందని చెప్పారు. బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుందని, నేతలు ప్రజల్లో ఉండాలని బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story