- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై భట్టి రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల దూకుడు పెంచారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. తాజా రాజకీయాలు, వైఎస్‌ఆర్‌టీపీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి అక్కడ మీడియాతో మాట్లాడారు.
షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ కుటుంబానికి చాలా గౌరవమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.