- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో పోటీపై బండి సంజయ్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని విమర్శించారు. ఏం చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని.. అది మునిగిపోయే నావా అని ఎద్దేవా చేశారు. ఒక వేళ కాంగ్రెస్ నుంచి గెలిచినా వారు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయం అని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా అది బీఆర్ఎస్‌కే ఉపయోగపడుతుందని తెలిపారు. దివాలా తీసిన సర్కారు ఖజానా కోసమే ముందస్తు మద్యం టెండర్లు వేస్తోందని తెలిపారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోం అని అన్నారు. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న చర్చ జరుగలేదని అన్నారు.