అలా జరిగితే మళ్లీ కేసీఆరే సీఎం అవుతాడు: షర్మిల

by GSrikanth |
అలా జరిగితే మళ్లీ కేసీఆరే సీఎం అవుతాడు: షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓట్లు చీలిస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశ్యంతోనే తాము కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల తెలిపారు. నాలుగు నెలలు ఎదురుచూశామని కానీ, వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సొంతంగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. లోటస్ పాండ్‌లో గురువారం పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం షర్మిల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ టీపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. 119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు బీ ఫాంల కోసం కోసం ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు.. మరో చోటు నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని ఆమె వెల్లడించారు. తనతో పాటు తన భర్త బ్రదర్ అనిల్, తల్లి విజయమ్మను కూడా బరిలోకి దింపాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అవసరమైతే, అనిల్‌తో పాటు విజయమ్మ సైతం పోటీ చేస్తారన్నారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదని తాము భావించామని, ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నామని ఆమె పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నట్లు తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలనను తీసుకు వస్తానని షర్మిల వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed