- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డి, బండి, ఈటలకు అమిత్ షా అల్టిమేటం!
దిశ, తెలంగాణ బ్యూరో: టీ.బీజేపీ నేతల తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి గుస్సా అయ్యారా? వారి తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారా? పార్టీని గాడిన పెట్టాల్సిన నేతలే ట్రాక్ తప్పితే ఎలా అని మొట్టికాయలు వేశారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్‌లో వారితో షా సమావేశమయ్యారు. తెలంగాణ నేతల కిస్సాపై.. గుస్సా అయినట్లు తెలుస్తోంది. అమిత్ షా వారితో ఇంకే అంశాలపై చర్చించారన్నది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీని గాడిలో పెట్టాల్సిన ముఖ్య నేతలే తలో దారిలో వెళ్తుండట జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లింది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.., కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈటల రాజేందర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నేతలంతా యూనిటీ మెయింటైన్ చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఇగోలు పక్కన పెట్టి ఇచ్చిన టాస్క్ పూర్తిచేయాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతసేపు సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనేది హైకమాండ్ దృష్టికి వచ్చిందని, ఆ పద్ధతి మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. నేతల మధ్య కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతోందని షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. నేతల ఇమేజ్ ను ఎక్కడా తగ్గనివ్వబోమని, నేతల ఇమేజ్ పెంచే బాధ్యత పార్టీ చూసుకుంటుందని, నేతలు పార్టీ ఇమేజ్ పెంచాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. నేతలు కేవలం పార్టీ ప్రయోజనాలపై దృష్టిపెట్టాలని అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య నేతల మధ్య పొసగడం లేదని తెలిసి గతంలోనే కిషన్ రెడ్డి, బండి, ఈటలకు కోఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కానీ వారు ఇప్పటికీ తమ పద్ధతులు మార్చుకోకపోవడం వల్లే షా గరం గరం అయినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో సీరియస్ గా లేకుంటే కేసీఆర్ ను ఢీకొట్టలేమనే విషయం కూడా చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడాలంటే.. నేతలు కలిసుండాలని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపుల్లేవని సీరియస్ అయినట్లు వినికిడి. కలిసుంటారా? కాదంటారా? అనేది నేతలే తేల్చుకోవాలిని, కలిసి పని చేసుకుంటే ఒకే.. లేదంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈనెల 26వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించనున్న బస్సు యాత్రలకు అమిత్ షా బ్రేకులు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్య నేతలే.. ఎవరికి వారు సెల్ఫ్ ఇమేజ్ కోసం, ఎవరికి వారే ప్రియారిటీ పెంచుకోవడం కోసం పాకులాడటం వల్లే షా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ ఈనెల 26 నుంచి మూడు రూట్లలో ముగ్గురు నేతలు బస్సు యాత్రలు చేపట్టాలని తొలుత భావించింది. కొమురం భీ జోన్, కృష్ణ జోన్, గోదావరి జోన్ నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. కానీ షా నిర్ణయంతో వీటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు టాక్. జాతీయ నాయకత్వం బస్సు యాత్రలకు రూట్ ఎప్పుడు క్లియర్ చేస్తుందో వేచి చూడాల్సిందే. అలాగే బీజేపీ ముఖ్య నేతలు ఇకనైనా వారి తీరు మార్చుకుంటారా? లేదా అనేది చూడాల్సి ఉంది.