- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బరిలో టీఆర్ఎస్.. కామన్ సింబల్ కేటాయించిన ఎన్నికల సంఘం!
దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేయాలని ఉవ్విళ్ళూరుతున్న గులాబీ దళపతి కేసీఆర్‌కు టీఆర్ఎస్ పేరుతో షాక్ తగులుతున్నది. దాదాపు ఇరవై ఏండ్లకు పైగా టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో వెళ్తున్నారు. గతేడాది దసరా నుంచి బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజ్య సమితి అనే కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఈ పార్టీకి వంట గ్యాస్ సిలిండర్‌ను కామన్ సింబల్‌గా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఇదే గుర్తుతో పోటేచేసేలా అవకాశం కల్పించింది. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ పార్టీని పెట్టినట్లు సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం ‘దిశ’కు వివరించారు. అనువైన అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామన్నారు.
కేసీఆర్‌కు ఊహించని షాక్ :
టీఆర్ఎస్ పేరుతొ కొత్త పార్టీ ఉనికిలోకి రావడం కేసీఆర్‌కు అనూహ్య పరిణామం. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్ ఒక పాపులర్ పదంగా కొనసాగింది. ఇప్పుడు అదే పేరు (అబ్రివేషన్)తో తుపాకుల బాలరంగం ఎన్నికల బరిలోకి దిగుతుండడం ఓటర్లలో కన్‌ప్యూజన్‌కు దారితీయనున్నది. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత్ చేర్చడంతో అప్పట్లో కేసీఆర్‌పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పదం వచ్చేలా ఆయనతో ఇరవై ఏండ్లుగా సన్నిహిత సంబంధం కలిగిన తుపాకుల బాలరంగం కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడం గమనార్హం. బాలరంగం, ఆయన భార్య గతంలో సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పటికీ ఆయన కోడలు స్థానిక ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఎలక్షన్ సింబల్స్‌కు అదనంగా తలనొప్పి :
ఇప్పటికే రోడ్డు రోలర్ లాంటి కొన్ని ఎన్నికల సింబల్స్ తో చికాకుల్లో ఉన్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఒకవైపు ఫ్రీ సింబల్స్ వివాదం కొలిక్కి రాకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తూ ఉన్న సమయంలో టీఆర్ఎస్ పేరుతొ కొత్త పార్టీ రావడం అదనంగా ఇబ్బంది పెట్టినట్లయింది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ రాజకీయ జాతకానికి ఏ విధంగా సంకటంగా మారనున్నదనేది ఎన్నికల తర్వాత స్పష్టం కానున్నది. ఇప్పటికీ ప్రజల్లో టీఆర్ఎస్ అనే పదం పట్ల ఉన్న అభిమానం ఇప్పుడు నేమ్ పాలిటిక్స్ తో ఏ పార్టీకి ఎంత మేలు, చేటు చేస్తుందనేది తేలనున్నది.
బహుజనులకు రాజ్యాధికారం కోసమే :
“ఏ పార్టీ నినాదం, విధానం ఎలా ఉన్నా తెలంగాణలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు ఒరిగిందేమీ లేదు. వారికి రాజ్యాధికారం రావాలన్న ఉద్దేశంతోనే ఈ పార్టీ పెట్టాను. మాకు బలమైన అభ్యర్థులు దొరికినచోట నిలబెడతాం. జనాభాలో సుమారు 13% ముదిరాజ్‌లు ఉన్నా ఒక్కరికీ బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. మంత్రివర్గంలో ఈటల తర్వాత ప్రాతినిధ్యం లేదు. రిజర్వేషన్ ఫలాలూ ఆశించినంతగా అందడంలేదు. కేసీఆర్‌తో కలిసి పనిచేశాను. ఆయనతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఏ వ్యక్తిమీద, పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. మా పార్టీ నినాదం బీసీలకు రాజ్యాధికారమే”.