- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ప్రియాంకాగాంధీ.. ఎల్లుండి రాహుల్ గాంధీ
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి సెకండ్ ఫేజ్ బస్సు యాత్రలో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంకాగాంధీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాల్గొనడానికి మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత తొలుత దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగే ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆ తర్వాత సాయంత్రానికి కొల్లాపూర్ సభలో ప్రసంగించాలనే షెడ్యూలు ఖరారైనా చివరి నిమిషంలో దేవరకద్ర మీటింగ్ రద్దయింది. మహిళలతో ప్రత్యేకంగా ముచ్చటించడానికి స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. సోనియాగాంధీ లాంఛనంగా ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్‌పై వారికి ప్రియాంక వివరించనున్నారు. మహిళలకు ప్రతి నెలా ఇవ్వనున్న ఆర్థిక సాయం, కుటుంబ బాధ్యతల్లో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ కష్టాలు మహిళలే మోస్తున్న నేపథ్యంలో ఉపశమనం కలిగించేలా రూ. 500కే సబ్సిడీ రూపంలో అందించే విషయాన్ని ఆమె వివరించనున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌గాంధీ బుధవారం హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. ఈ సెగ్మెంట్ల పరిధిలో జరిగే బస్సు యాత్రలోనూ పాల్గొననున్నారు. రెండో రోజు టూర్‌లో భాగంగా గురువారం ఆయన మేడ్చల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో జరిగే బస్సు యాత్రలో పాల్గొనేలా పీసీసీ నేతలు పర్యటనను ఖరారు చేశారు. కానీ రాహుల్‌గాంధీ ముందుగానే నిర్ణయించుకున్న షెడ్యూలులో భాగంగా గురువారం పర్యటనలో మార్పులు చేర్పులు జరిగే అవకాశమున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం.