- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారం ఎమ్ఐఎమ్ కార్యకర్తలు ఆయన కార్యలయ ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, బండి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, ఎమ్ఐఎమ్ వైఖరికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు.
మరోవైపు ఈ పరిణామాలపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. వారంతా ఎంఐఎం సానుభూతిపరులేనని ఆరోపించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడే మంత్రి కేటీఆర్ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీ నాయకుల చర్యలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఓ ఎంపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తోన్నారని డీకే అరుణ నిలదీశారు.