నేడే తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. 58 మందితో జాబితా సిద్ధం!

by GSrikanth |
నేడే తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. 58 మందితో జాబితా సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ 58 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును నేడు రిలీజ్ చేయనున్నది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ లిస్టును ప్రకటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే భేటీ జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మరోసారి సమీక్ష తర్వాత కమ్యూనిస్టులకు ఇచ్చే సీట్ల వివరాలను కాంగ్రెస్ ప్రకటిస్తుందని ఓ నాయకుడు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కమ్యూనిస్టు పార్టీల అధ్యక్షులను కో ఆర్డినేట్ చేస్తున్నారు. కామ్రేడ్స్‌తో పార్టీ పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం, మిర్యాలగూడ, భద్రాచలం, మునుగోడుతో పాటు మరో రెండు సెగ్మెంట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ హోల్డ్‌లో ఉంచింది. స్క్రీనింగ్ కమిటీ, సీఈసీ నుంచి ఆయా సెగ్మెంట్‌లలో ఎంపిక చేసిన అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినప్పటికీ.. ఫస్ట్ లిస్టులో వారి పేర్లను ప్రకటించడం లేదని సమాచారం.

వంద మంది అభ్యర్థులు ఫైనల్?

కాంగ్రెస్ పార్టీలో దాదాపు 100 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖారారు చేసినట్టు ఏఐసీసీ సమాచారం. చేరికలు, కమ్యూనిస్టుల పొత్తుల, పార్టీ కేడర్ ప్రయారిటీ, రాజకీయ సమీకరణలు దృష్ట్యా 58 అభ్యర్థులతో మాత్రమే ఫస్ట్ లిస్టును ప్రకటించనున్నారు. ఇవన్నీ సర్వేలో మంచి స్కోర్ సాధించాయని, ఎలాంటి విభేధాలు లేని నియోజకవర్గాలని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫస్ట్ లిస్టులో ప్రకటించే సెగ్మెంటన్నింటిలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: మురళీధరన్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్

‘సర్వేలు, క్షేత్రస్థాయి సమీకరణాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తున్నాం. ఒక్కో అభ్యర్థి విషయంలో సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చిస్తున్నాం. ఆశావహులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. పార్టీ పవర్‌లోకి రాగానే ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు టిక్కెట్ల కోసం ప్రయత్నించిన నేతలకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వామపక్షాలతో పొత్తు విషయం చివరి దశకు చేరుకున్నది.’

Advertisement

Next Story

Most Viewed