ఎలక్షన్ ప్రచారం ప్రారంభిస్తున్నారా.. అయితే ముందు చేయాల్సిన పని ఇదే!

by GSrikanth |
ఎలక్షన్ ప్రచారం ప్రారంభిస్తున్నారా.. అయితే ముందు చేయాల్సిన పని ఇదే!
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ప్రచారం కోసం ఎన్నికల సంఘం అధికారుల నుంచి అనుమతి పొందేం వీలుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం సువిధ సింగిల్ విండో యాప్‌ను అందుబాటులోకి తేనుంది. వచ్చే నెల 3 తేదీ నుండి ప్రారంభం కానున్న నామినేషన్ల పర్వంలో భాగంగా ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించే అభ్యర్థులు ఎన్నికల సంఘం అనుమతిని తీసుకునేందుకు ఈ యాప్ ను వినియోగించుకోవచ్చునని ఎన్నికల యంత్రాంగ సూచించింది. వారు దరఖాస్తు పెట్టుకున్న 48 గంటల్లోనే అనుమతులు జారీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నామినేషన్ ప్రక్రియలో గుర్తింపు పొందిన, రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల నుండి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కోసం సులభమైన పద్దతిలో అనుమతులను జారీ చేయుటకు సువిధ యాప్ సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, డోర్ టు డోర్ ప్రచారం, డిస్ ప్లే బ్యానర్స్, బ్యారికెడ్ లు ఫ్లాగ్స్, అనుమతి కోసం సులభతరంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా సువిధ కౌంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ షెడ్యూల్ వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సువిధ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సారి తీసుకున్న అనుమతి 72 గంటల చెల్లుబాటులో ఉంటుందని సువిధ యాప్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed