- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.12,617 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు 22.46 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపింది. ఇంకా 7.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6400 కోట్లు జమ చేయాల్సి ఉందని వెల్లడించింది. మిగతా సొమ్మును త్వరలోనే జమ చేస్తామని పేర్కొన్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ డబ్బులు అందుతాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాంకేతిక కారణాల వల్ల కొంత మంది రైతులకు అందాల్సిన డబ్బులు బ్యాంకుల నుంచి వెనక్కి వచ్చాయని తెలిపింది. రుణమాఫీ సమస్యలున్న వారి కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైతు రుణమాఫీపై ఏమైనా సందేహాలు ఉంటే 040 - 23243667 నంబర్‌కు రైతుల ఫోన్ చేయవచ్చని సంబంధిత శాఖ మంత్రి పేర్కొన్నారు.
Advertisement
Next Story