ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం.. పోచంపల్లికి చేరుకున్న సిరిసిల్ల చీరలు! (వీడియో)

by GSrikanth |
ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం.. పోచంపల్లికి చేరుకున్న సిరిసిల్ల చీరలు! (వీడియో)
X

దిశ, భూదాన్ పోచంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా నుంచి దాదాపు 80 డీసీఎంలు, ఆర్టీసీ కార్గో సర్వీసులలో ఫుల్ లోడెడ్‌తో చీరల పంపిణీ సిద్ధమయ్యారు. ఆదివారం ఈ చీరలు ఓటర్లకు పంచడానికి భూదాన్ పోచంపల్లి మండలం దంతూరు గ్రామంలోని హ్యాండ్లూమ్ పార్క్‌కు చేరుకున్నాయి. ఈ తెలుసుకున్న స్థానికులు గుట్టు రట్టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ ఎక్కువై ప్రలోభాలు మొదలు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నంలో మద్యం, డబ్బులే కాకుండా కానుకల పేరిట మహిళలకు ఎరవేస్తూ చీరలను పంచేందుకు పెద్ద ఎత్తున డీసీఎంలో తీసుకొచ్చారని మండిపడుతున్నారు. అధికారుల అండదండలతోనే ఈ తంతు నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/Dy_z5IkFE2o


Advertisement

Next Story

Most Viewed