- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 30న జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటికే రూ.570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అప్పా జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు ఆరు కార్లలో తరలిస్తున్న రూ.6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా ఓ కాంగ్రెస్ ముఖ్య నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే తరలిస్తున్నారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి కార్లునూ సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత నెల అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.