- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు నిజామాబాద్‌కు ప్రధాని మోడీ.. పసుపు బోర్డు ఏర్పాటుపై కీలక ప్రసంగం చేసే ఛాన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల వేదికల వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3:40 గంటల వరకు సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలుంటాయి. అనంతరం 3:45కి సమీపంలోని బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగిస్తారు. దీనికి ‘ఇందూరు జన గర్జన సభ’గా బీజేపీ నామకరణం చేసింది.
అయితే, ఈ సభలో పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్‌లో పాలాభిషేకాలు మొదలయ్యాయి. బోర్డు ఏర్పాటుకు నిర్ణయించినట్లు పాలమూరు సభలోనే ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మోడీ పాల్గొనే సభకు పెద్ద ఎత్తున పసుపు రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోర్డు ఎక్కడ ఏర్పాటుచేయనున్నారు? దానికి ఎంతకాలం పడుతుంది? తదితర విషయాలపై ప్రధాని స్పష్టత ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు. సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు బీదర్‌కు తిరుగు ప్రయాణమవుతారు.