CM కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

by GSrikanth |
CM కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమానం వచ్చిన అన్ని వాహనాలను పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు, వీఐపీలు, మంత్రులు అనే తేడా లేకుండా అధికారులు అందరి వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అధినేత ఒవైసీ లాంటి వారి వాహనాలు తనిఖీలు చేసిన అధికారులు.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాహనాన్ని కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందుకు కేసీఆర్ కూడా సహకరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో కేసీఆర్ వాహానాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed