- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ విషయంలో ‘నో’ క్లారిటీ.. కన్ఫ్యూజన్‌లో కమ్యూనిస్టులు!
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ తమ ఫోకస్‌ను పెంచుతున్నాయి. ఎవరికి వారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో కమ్యూనిస్టు పార్టీల తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నది. మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసిన కారు, కంకి కొడవలి బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా లేదా అనేదానిపై రోజుకో ప్రచారం తెరమీదకు వస్తున్నది. జెండాలు మోసేందుకు కమ్యూనిస్టులకు కార్యకర్తలే లేరని బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. కమ్యూనిస్టు నేతలు మాత్రం తమను అవమానించడం సరికాదంటూనే పొత్తుకు పాకులాడుతున్నారనే చర్చ ఆసక్తిగా మారింది. ఈ పరిణామాలతో కమ్యూనిస్టు నాయకత్వం తీరుపై సొంత కేడర్‌లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
అసలు టార్గెట్ ఏంటి..?
తమకు బలమైన స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తూనే.. మరోవైపు బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కమ్యూనిస్టు నాయకుల అసలు టార్గెట్ ఏంటి..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తాజాగా.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ 15-20 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని ప్రకటించారు. నిజానికి పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంకు కలిపి ఐదు నుండి ఆరు స్థానాలలోపే ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే.. ఎన్నికల వేళ కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే.. అటు బీఆర్ఎస్‌తో కట్ అయి, అటు కాంగ్రెస్‌తో కలవకుండా రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారుతుందా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
గులాబీ బాస్ మౌనం.. దేనికి అర్థం!
నిజానికి మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టులకు కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఒకే వేదికపై నుండి ఐక్యతా రాగం ఆలపించడంతో వీరి పొత్తు చివరి వరకు ఉంటుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అయితే.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలను అవమానించేలా సొంత పార్టీ నేతల కామెంట్స్ చేస్తున్నా కనీసం స్పందించడం లేదు. ఇక సీట్ల విషయంలో తేల్చాలని పట్టుబడుతున్నా మౌనం వీడటం లేదు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ వద్దే తమ విషయాలు తేల్చుకుంటామని కమ్యూనిస్టులు చేస్తున్న ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.