- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ప్రారంభమైన మాక్ పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మాక్ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 50ఓట్లు పోల్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున 6 గంటలకు ఈ మాక్ పోలింగ్ ప్రారంభమైంది. కాగా, ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు. రాష్ట్రంలో మూడు కోట్లా 26 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.