- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనూహ్యంగా ఆ మహానేతపై కేటీఆర్ పొగడ్తలు.. ఓట్ల కోసమేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఈసారి ఏ పార్టీకి వెళ్తుంది?.. ఇప్పటివరకు అనుకూలంగా ఉన్న పరిస్థితే ఇప్పుడూ కంటిన్యూ అవుతుందా?.. చంద్రబాబు అరెస్టు విషయంలో అనుసరించిన వ్యూహం బెడిసికొట్టిందా?.. దాని ప్రభావం ఈసారి ఎన్ని కల్లో రిఫ్లెక్ట్ అవుతుందా?.. చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన ఐటీ ఉద్యోగులపై పోలీసు చర్యలు నెగెటివ్ అయిందా?.. ఇవీ ఇప్పుడు పలు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతల్లో జరుగుతున్న చర్చ. ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం బాన్సువాడలో జరిగిన ఒక కార్యక్రమం చంద్రబాబుపై సానుభూతి ప్రకటించారు. తాజాగా కేటీఆర్, హరీశ్ రావు స్పందించారు.
కేటీఆర్ కామెంట్లతో పార్టీకి డ్యామేజ్
చంద్రబాబు అరెస్టు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని కేటీఆర్ మూడు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కేటీఆర్ కేవలం తెలంగాణ కోణం నుంచి మాత్రమే మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న ఓటర్లలో సందేహాలకు తావిచ్చినట్లైంది. ఇప్పటివరకూ చంద్రబాబు అ రెస్టుపై పార్టీ స్పష్టమైన విధానాన్ని బహిర్గతం చేయలేదు. ఆ పార్టీ నేతలు వారికి తోచిన తీరులో స్థానిక ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని స్పందిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 32 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు స్థానాలతో పాటు హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, జూబిలీ హిల్స్ లాంటి చోట్ల ఆ ఓటు బ్యాంకు చేజారకుండా అభ్యర్థులు చూసుకుంటున్నారు.
ఎన్టీఆర్‌పై కేటీఆర్ ప్రశంసలు
ఇప్పటివరకూ చేసిన కామెంట్లతో డ్యామేజ్ జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తుకోవడంతో నష్ట నివారణలో భాగంగా దివంగత సీఎం ఎన్టీఆర్‌పై కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం.. ఎవరు ఎన్ని చరిత్రలు రాసినా కొన్ని చెరిగిపోని సత్యాలు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పింది ఎన్టీఆర్ మాత్రమే.. ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. నాకు ఆ ఇద్దరూ ఎన్టీఆరే... తారక రామారావు పేరు లోనే పవర్ ఉంది.. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్థిత్వాన్ని చాటిచెప్పారు.. అంటూ కేటీఆర్ పొగడ్తలు కురిపించక తప్పలేదు.
నిన్నటివరకూ పార్టీ అభ్యర్థులకు జరిగిన డ్యామేజీని చంద్రబాబు పేరెత్తకుండా ఎన్టీఆర్ ఇమేజ్‌తో పూడ్చుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎన్టీఆర్ పేరు ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఎన్టీఆర్ పేరును తెరమీదకు తీసుకురావాల్సి వచ్చిందనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్ర పెత్తనం.. అనే అస్త్రాన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ విస్తృతంగా వినియోగించుకున్నది. ప్రజల్లో ఎమోషన్స్ రేకెత్తించింది. సెంటిమెంట్‌ను గెలుపు కోసం బలంగా వాడుకున్నది. ఆ కారణంగానే ఇప్పుడు చంద్రబాబు పట్ల సానుభూతి వద్దనుకుని కేటీఆర్ మూడు రోజుల క్రితం ఆ వైఖరి తీసుకున్నరనేది ఇప్పుడు చర్చల్లో నలుగుతున్నది.
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం : హరీశ్‌రావు
చంద్రబాబు అరెస్టుపై ఇంతకాలం ఎలాంటి కామెంట్లు చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయిన మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లా సిద్దిపేటలో శనివారం జరిగిన కార్యక్రమంలో సానుభూతి కురిపించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం.. అక్కడి ప్రభుతవ్ ఆ పని చేయకుండా ఉండాల్సింది.. అంటూ నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బహిరంగంగానే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన భూముల ధరల గురించి చంద్రబాబు గతంలో ప్రస్తావించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.