- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావుల వద్ద రైతులు చనిపోయిన ఘటనలు ఎన్నో: హరీశ్ రావు
దిశ, వెబ్‌డెస్క్: రైతుల పట్ట కాంగ్రెస్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అందరికీ అర్ధం అవుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. రైతు బంధుపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని రైతులు గమనించాలని కోరారు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని గుర్తుచేశారు. ఎన్నేళ్లైనా కాంగ్రెస్‌కు రైతుల మీద ఉండదని, అదంతా కపట ప్రేమ అని అన్నారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు కేసీఆర్ వైపు ఉన్నారు. ఎన్నికల్లో చెప్పకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును అమలు చేస్తుందన్నారు.
ఓట్ల కోసం రైతు బంధును తేలేదు. రైతు బంధును నిలిపివేయాలని కాంగ్రెస్ ఈసీని ఎలా కోరుతుందని ప్రశ్నించారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి 5 గంటలు ఇస్తామని చెప్పాడు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు 3 చాలు అంటున్నాడు. రేపు ఆసరా ఫించన్లతో పాటు ఇతర స్కీమ్‌లనూ ఆపాలని కాంగ్రెస్ కోరుతుందేమోనని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, నీటి సమస్యలు ఉండేవి. కరెంట్ లేక బావుల వద్ద నిద్రిస్తున్న రైతులకు పాము కాటు వల్ల ఎంతో మంది మరణించారని పేర్కొన్నారు. రైతులు కేసీఆర్ ఓటు వేస్తారని కాంగ్రెస్ భయపడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.