- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఎన్నికల్లో లీడర్ల కొత్త స్ట్రాటజీ.. అయోమయంలో ప్రజలు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రసంగాలు రోజురోజుకూ ఆసక్తి రేపుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు అన్నచందంగా ప్రసంగాలు సాగుతున్నాయి. అంతే తప్ప ప్రజల సమస్యలు కానీ, హామీలపై కానీ దృష్టి సారించడం లేదు. ‘దమ్ముంటే ఇక్కడ పోటీ చేయ్.. దమ్ముంటే అక్కడ బరిలోకి దిగు’ అంటూ మాటల యుద్ధం పెంచుతున్నారు. దీంతో లీడర్లపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ‘నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మీకు వద్దా.. మీ సవాళ్లే మీకు ముఖ్యమా’ అని పెదవి విరుస్తున్నారు.
నిరుద్యోగంపై మాట్లాడని కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్‌పై కామారెడ్డిలో దమ్ముంటే పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులకు సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్ కొడంగల్‌కు వచ్చి పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరోవైపు బీజేపీ నేత రాజాసింగ్ కూడా ఎంఐఎం అధినేత ఓవైసీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం కేసీఆర్‌పై పోటీకి సవాల్ చేసి బరిలో దిగుతున్నారు. అయితే.. బీఆర్ఎస్ నేతలు పోటీపై సవాళ్లు విసరడం తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం లేదు. గులాబీ బాస్ కేసీఆర్ తన స్పీచ్‌లో కాంగ్రెస్, బీజేపీలను తిట్టడం తప్పితే.. సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగంపై కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో, సభల్లో మాట్లాడటం లేదు. దీంతో నిరుద్యోగులు సైతం అసంతృప్తితో ఉన్నారు.
మేనిఫెస్టో ప్రకటించని బీజేపీ
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీల హామీలు, బీఆర్ఎస్, బీఎస్పీలు ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టోలు తయారు చేశాయి. కానీ.. బీజేపీ మాత్రం ఇంకా మేనిఫెస్టో కూడా తయారు చేయలేదు. కేవలం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ప్రచారంలో ప్రజల సమస్యలపై కాకుండా నాయకులను తిట్టడం వరకే సరిపోతోంది. దీంతో ఓటు ఎవరికి వేస్తే సమస్యలు తీరుతాయో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.