- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP తరపున పవన్ కల్యాణ్ ప్రచారం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు బీజేపీ జాతీయ నేతలతో పాటు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యా్ణ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. తమకు ప్రాంతీయ భేదాలు లేవని.. ఆంధ్రా, తెలంగాణ ఒక్కటే అని అన్నారు. జనసేన 2014 నుంచి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని కిషన్ రెడ్డి చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు.
ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పవన్ 70 సీట్లలో నామినేషన్ వేస్తే.. తాము వెళ్లి మాట్లాడిన అనంతరం విత్ డ్రా చేసుకున్నారని.. ఆ తర్వాత బీజేపీకి మద్దతుగా జనసేన కేడర్ అంతా ప్రచారం కూడా చేశారన్నారు కిషన్ రెడ్డి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన 33 సీట్లకు అభ్యర్థులకు ప్రకటిస్తే.. తాము సమావేశం అయిన అనంతరం 8 సీట్లకే పరిమితమయ్యారని.. పవన్ ఎన్డీఏకి పాత మిత్రుడేనని.. వారితోనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.