నేను చెప్పేది అబద్ధమైతే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించండి: కేసీఆర్

by GSrikanth |
నేను చెప్పేది అబద్ధమైతే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించండి: కేసీఆర్
X

డైనమిక్ బ్యూరో/మహబూబ్ నగర్/దేవరకద్ర: దేవరకద్రలో లక్ష ఎకరాల్లో వరి పండేలా చేశాం. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణితి భారత దేశంలో ఇంకా రావడం లేదు. సమైక్య రాష్ట్రంలో పాలమూరును ఏ గతి పట్టించారో మీ అందరికి తెలుసు. బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే ఎలా పని చేస్తారో మీ అందరికీ తెలుసు. ప్రజలు ఆలోచన చేయాలి. ఆగం ఆగం ఓటు వేయవద్దు. అన్ని పార్టీల అభ్యర్థుల గుణగణాలను బేరీజు వేసుకోవాలని కోరారు. సోమవారం దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. గత కాంగ్రెస్ పాలకులు పాలమూరు ప్రాజెక్టులకు నష్టం జరుగుతుంటే నోరుమెదరలేదని విమర్శించారు.

పాలమూరును సర్వనాశం చేసిన పార్టీ కాంగ్రెస్. చివరకు జూరాల ప్రాజెక్టు మంజూరు చేసినా పనులు ముందుకు సాగలేదు. చివరకు బీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు పనులు ముందుకు పడలేదు. ఈ చరిత్ర అంతా కళ్లముందే ఉంది. మేము చెప్పేది అబద్ధమైతే మమ్మల్ని ఓడించండి. లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపిచాలన్నారు. తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో పెండిగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తున్నామన్నారు. ఇటీవలే పాలమూరుకు స్విచ్ ఆన్ చేశాను. కరివెన రిజర్వాయర్ పూర్తి కావొస్తోంది. ఇది పూర్తయితే దేవరకద్రకు మరో 70 వేల ఎకరాలకు అదనపు నీళ్లు వస్తాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed