మూడ్రోజుల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం

by GSrikanth |
మూడ్రోజుల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: మూడ్రోజుల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఇక్కడ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.94 వేల అప్పు ఉందని అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా కర్ణాటకలో ఐదు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే అవినీతికి కొత్త దారులు వెతుకుతాడని అన్నారు.

Advertisement

Next Story