కామారెడ్డి రైతులతో భేటీ.. మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

by GSrikanth |
కామారెడ్డి రైతులతో భేటీ.. మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావుతో కామారెడ్డి రైతు జేఏసీ బృందం శనివారం ప్రగతి భవన్‌లో భేటీ అయింది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్‌కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిసింది. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు.

Advertisement

Next Story