- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పార్టీని స్థాపించింది ఆయనే.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మజ్లిక్ తిరంగా ర్యాలీలో ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు హైదరాబాద్ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. తాము రజాకార్ల వారసులమని బీజేపీ అంటోంది.. నిజాం వారసులమని కాంగ్రెస్ విమర్శి్స్తోందని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ బండి పంక్చర్ అయిందని.. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. తమ(MIM) పార్టీని అబ్దుల్ వాహిద్ ఒవైసీ స్థాపించారని గుర్తుచేశారు.
ఖాసీం రజ్వీ తమ పార్టీని స్థాపించలేదని చెప్పారు. అంతకుముందు ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని తాను అసలు కేర్ చేయనని చెప్పారు. వాస్తవానికి దేశంలో రాజకీయ శూన్యత ఉందని.. ఆ శూన్యతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ భర్తీ చేస్తుందని భావించానని చెప్పారు. ఈ రాజకీయ శూన్యతను ఇండియా కూటమి భర్తీ చేయలేదని అన్నారు. ఇండియా కూటమిలో కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాదని చెప్పారు.