తెలంగాణలో డిసెంబర్ 3న దీపావళి జరుపుకోండి: అమిత్ షా

by GSrikanth |
తెలంగాణలో డిసెంబర్ 3న దీపావళి జరుపుకోండి: అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. అందుకే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని.. కేసీఆర్‌ను ఇంటికి పంపి.. డిసెంబర్ 3వ తేదీన రెండోసారి తెలంగాణ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోండి అని అమిత్ షా పిలుపునిచ్చారు.

కేవలం మోడీతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీ వస్తే తెలంగాణకు కుటుంబ పార్టీ నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర దినోత్సవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని తీసుకొచ్చిన ప్రతీ పథకంలో అవినీతి జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, మియాపూర్ భూ కుంభకోణానికి కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జనవరి 26న ప్రారంభోత్సవం తర్వాత మరోసారి దీపావళి జరుపుకోవాలని అన్నారు.

Advertisement

Next Story