- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత?
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు దశాబ్దాల క్రితం పవర్ ఫుల్ పొలిటిషియన్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పాలిటిక్స్ ఆయన కనుసన్నల్లోనే నడిచేది. నకిలీ స్టాంపుల కుంభకోణం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇక అప్పటి నుంచి రాజకీయంగా తిరిగి నిలబడలేకపోయారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇవాళ ప్రకటించారు. మరోవైపు తాను ఈ నిర్ణయం తీసుకోవాడని కారణం ఇవాళ నిర్వహించబోయే ప్రెస్ మీట్‌లో చెబుతానని ప్రకటించారు.
బీజీపీలోకి చేరుతారనే ప్రచారం
కాగా, తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వేగంగా నేతలు మారుతున్నారు. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి అనుకూలమైన పార్టీలోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్‌లో పెద్దగా ప్రాధాన్యంలేని లీడర్‌గా ఉన్న కృష్ణ యాదవ్ బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వాలని అడుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంబర్‌పేట్ లేదా మలక్‌పేట్ టికెట్‌ను ఆయన అడుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.