- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో చేరిన ఏపూరి సోమన్న.. ఆ పాటపై క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో గాయకుడు ఏపూరి సోమన్న చేరారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమక్షంలో గులాబీపార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హంతక రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో లేవని అన్నారు. ఒక పార్టీ కుమ్ములాట పార్టీ.. మరో పార్టీలోకి సోమన్న వెళ్తే చెట్టు ఎక్కించి చేతులు ఇడిసినట్లు వాళ్ల దారి వాళ్ళు చూసుకున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయిందన్నట్లు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపూరి చాలా తిరిగి చూశానని, కొన్నిపార్టీలను దగ్గరచూశానన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి, అన్నివర్గాల బలోపేతానికి పాటుపడుతుందన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవి, గాయకులను శాసన మండలిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సాయి చంద్ కుటుంబాన్ని పార్టీ ఆదుకున్న తీరు నచ్చిందన్నారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మాట్లాడుతూ.. సోమన్న చేరికకు హరీష్ రావు, కేటీఆర్, కవిత ఎవరో ఒక్కరూ వచ్చేది ఉండేనన్నారు. కానీ ఇతర పనుల్లో ఉండటంతో రాలేకపోయారన్నారు. గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. ఏ పార్టీ అయినా ఏ జెండా అయిన ప్రజల ఎజెండానే ముఖ్యం అన్నారు. ‘నాకు ఒక లక్ష్యం ఉంది’ అన్నారు. తెలంగాణ భవన్‌లో అడుగు పెట్టక పదేళ్లు అయ్యిందన్నారు.
‘ఎవరి పాలయిందిరో తెలంగాణ’ అని పాట రాశానని, కానీ పదేళ్లు అయినా తెలంగాణకు ఆల్టర్ నేటివ్ లేదు.. ఆల్టర్ నేటివ్ వస్తుందని కల కన్నా కానీ రాలేదు.. నేను మాట్లాడి పాట పాడితే కొంతమందికే ఎంటర్టైన్మెంట్ అయ్యిందన్నారు. తెలంగాణలో రూపాయికి ముప్పావులా వంతు మంది ప్రజలు కేసీఆర్‌తో ఉన్నారన్నారు. తెలంగాణ వచ్చే ముందే ఈ భవన్‌కు దూరం అయ్యానని, తన ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. పాట రోడ్ల మీద ఉండొద్దు చట్ట సభల్లో రావాలని కేసీఆర్ చూశారని, ‘ఎవరి పాలయింది అంటే బరబార్ కేసీఆర్ పాలయ్యిందని.. కేసీఆర్ పాలే కావాలన్నారు. 25 ఏళ్లు కష్టపడితే పెద్దల సరసన ఇప్పుడు కూర్చున్న.. ఈ భవన్ మెట్లు ఎక్కానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను భాగం అయ్యానన్నారు. బీఆర్ఎస్‌కు కట్టుబడి పని చేస్తానని స్పష్టం చేశారు. మేము తిరిగిన పార్టీలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. కేసీఆర్ దారిలో నడుస్తామని, మళ్ళీ కాలుకు గజ్జె కడుతా.. కేసీఆర్ పాట పాడుతూ.. అభివృద్ధి పాట పాడుతానని వెల్లడించారు.