- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తే నామినేషన్ తిరస్కరణే: వికాస్ రాజ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల సరళిపై రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలన్నారు. నాయకులు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఓటు వేయడంలో వయోవృద్ధులకు సాయం చేయడానికి వాలంటీర్లను పెడుతున్నామని చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.
బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా నింపాలని లేకుంటే ఆ నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని చెప్పారు. నగదు ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు చూపించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ఖర్చు మానిటరింగ్‌కు స్పెషల్ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తామని తెలిపారు. ఎన్నికల అక్రమాలపై సీ విజిల్ యాప్ తో పాటు 1950 టోల్ ప్రీ నెంబర్ కు కాల్ చేసి కంప్లెంట్ చేయొచ్చన్నారు. అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు కోసం ద రఖాస్తు చేసుకోవచ్చని అయితే అడ్రస్ లో మార్పుల కోసం దరఖాస్తులు ఇవాళ్టి నుంచి వాయిదా వేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.