- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీళ్లేదు: తమ్మినేని
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం మండిపడ్డారు. ఆదివారం తమ్మినేనీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఇంతవరకు విభజన చట్టాలు అమలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని పలు అంశాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని అన్నారు.
ఆ రాష్ట్రాల్లో అమలు కానప్పుడు ఇక్కడ ఎలా సాధ్యం అవుతాయని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజలను మోసం చేయడమే అని సీరియస్ అయ్యారు. ప్రజల్లో చీలిక తెచ్చే కుట్రలో భాగమే అని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తప్పక బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని సేకరించకుండా తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధాని ప్రకటించిన పసుపు బోర్డు ఏర్పాటులో కూడా మళ్లీ ఇప్పటివరకు ముందడుగు పడలేదని అన్నారు. అసలు బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు.