పొత్తులపై CPI కూనంనేని కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
పొత్తులపై CPI కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరణ జరుగుతోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. శనివారం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతో కేంద్రం జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. జమిలి ఎన్నికలను సీపీఐ పార్టీ సంపూర్ణంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌పై కూనంనేని స్పందించారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిని ఎఫ్‌ఐఆర్ కాపీ చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి రాజ్యంగ వ్యవస్థలను వాడుకోకూడదని సూచించారు. పొత్తులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వామపక్షాలం కలిసి పోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story