- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అగ్రిమెంట్ కుదిరాకే కేసీఆర్‌తో మోడీ ఫ్రెండ్లీ రిలేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట కవిత కేసులో మోడీతో రాజీ ఒప్పందం కుదిరాకే బీజేపీతో కేసీఆర్ ఫ్రెండ్లీ రిలేషన్ స్టార్ట్ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను, కూతురును కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అని వారు చెబుతున్నరన్నారు. ఆ కేసు నుండి బయటపడేందుకు వారి మధ్య ఒప్పందాలు కుదిరాయని అన్నారు. వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.
మంగళవారం కేంద్ర హోమ్ మంత్రి, మొన్న ప్రధాని మాట్లాడిన మాటలు ఆత్మస్మృతి పరనిందలా ఉన్నవని అన్నారు. అసలు వాళ్లను కాపాడేదే బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. అందుకే మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారని.. అందరూ కలిసి కుమ్మకై సిసోడియాను మాత్రమే ఇరికించారని తెలిపారు. అందులో కేంద్రం భాగస్వాములు కాదా? అని ఆయన ప్రశ్నించారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వయిరీ వేశారు.. ఆదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వయిరీ చేయలేదన్నారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారు.. మోడీ దీనిని ఆఫ్ రికార్డ్ అని ఓపెన్‌గా చెప్పారని తెలిపారు. నిరాశ నిస్పృహలో ఉన్నవారు, ఓటమికి దగ్గరవుతున్నవారు ఇలాంటి అబద్ధాలు, అనైతిక మాటలు మాట్లాడడం దేశానికి మంచిది కాదన్నారు.