- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు సీఎం కావాలి.. మాకు సీట్లు కావాలి
దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తుల అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించాలని అన్నారు. జాతీయ స్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలోనే ఉంది. తెలంగాణలోనూ పొత్తులు, సర్దుబాట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారాయణ కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలన్నది మా ఉద్దేశం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావాలి.. మాకు సీట్లు కావాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్నికల కోసమే మహిళా బిల్లు తీసుకొచ్చారని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లు ముడిపెట్టడం రాజకీయంలో భాగమే అని డీలిమిటేషన్ పేరుతో ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య బీజేపీ గొడవ పెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వమే కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయం అన్నారు.