- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం లేదు: CSHF
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సెక్యులర్ హిందూ ఫోరం(సీఎస్ హెచ్ ఎఫ్) ఓ ప్రకటనను విడుదల చేసింది. స్టేట్‌తో పాటు సెంట్రల్‌లోనూ పార్టీకి సపోర్టు చేయమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సెక్యూలర్ హిందూ ఫోరమ్ సంస్థ గత కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేసిందని, కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తమను గుర్తించలేదని సీఎస్ హెచ్ ఎఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఆర్గనైజేషన్ నుంచి కనీసం ఒక్కరికి టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరినా.. పట్టించుకోలేదని విమర్శించారు.
సీఎస్ హెచ్ఎఫ్లో క్రీయా శీలకంగా పనిచేసిన రాజు యాదవ్‌కు ఖైరతాబాద్ టిక్కెట్ అడిగామని, కానీ ఏఐసీసీ తిరస్కరించడం దారుణమన్నారు. సీఎస్ హెచ్ఎఫ్సంస్థలో పనిచేసే వాళ్లంతా మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు గ్రూప్‌కు చెందిన వాళ్లేనని వెల్లడించింది. దీంతోనే టిక్కెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని సీఎస్ హెచ్ ఎఫ్ సంస్థ ఆరోపించింది. ఇదిలా ఉండగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ పోషించినట్లు, కాంగ్రెస్‌లో సీఎస్ హెచ్ ఎఫ్ ఆ తరహాలోనే పనిచేస్తుందని రాజకీయ నాయకులు చెబుతున్నారు.