- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్స్ షాపుల్లో తెలంగాణ నంబర్ వన్: వీహెచ్
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ తెలంగాణను వైన్స్ షాపుల్లో నంబర్ వన్ చేశాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడని ప్రశ్నించారు. స్వరాష్ట్రం కోసం పార్లమెంట్‌లో కొట్లాడింది తామని.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అన్నారు. మరోవైపు ఆనాడు సోనియాగాంధీని పొగిడిన కేసీఆర్ నేడు ఆమెను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ తిరుగుతుంటే ఎందుకు వస్తున్నాడని అడుగుతున్నారని.. మీరెందుకు మహారాష్ట్ర పోయారని ప్రశ్నించారు. గతంలో అన్నం పెట్టే రైతన్నకు ఖమ్మంలో కేసీఆర్ సంకెళ్లు వేయించాడని గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.