- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌ది ఫాల్స్ ప్రచారం.. కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లెటర్ హెడ్ ట్యాంపర్ చేసి ఫాక్స్ కాన్ గ్రూప్‌లకు లేఖ రాసినట్లు కేటీఆర్ అండ్ బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేస్తుందని, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ సంస్థకు డీకే రాశారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి తెర లేపిందన్నారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైందన్నారు. కేటీఆర్ ఫాల్స్ ప్రచారం చేయడంలో నంబర్ వన్ అని విమర్శించారు. కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే కేటీఆర్ ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ నుంచి డీకేతో మాట్లాడమని, ఈ లెటర్ ఫేక్‌గా తేలిందన్నారు. కేటీఆర్ బూతు స్థాయి నాయకుడిగా మాట్లాడుతున్నాడన్నారు. నిత్యం కాంగ్రెస్‌ని ఎలా బ్లేమ్ చేయాలని? ప్లాన్ చేస్తున్నారన్నారు. ఫేక్ న్యూస్‌లు, మార్ఫింగ్‌లు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. దీని వలన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందనే ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ అండ్ టీమ్ ఇలా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. కర్ణాటక గ్యారంటీల అమలు విధానాన్ని పరిశీలించేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో బస్సును ఏర్పాటు చేస్తే.. కేటీఆర్ భయపడి రాలేదన్నారు. సవాల్‌ను స్వీకరించే సాహసం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ మెంబరు బైకాని లింగం యాదవ్ పాల్గొన్నారు.