- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో కాంగ్రెస్ కోవర్టులు.. ఇప్పటికే అధినేత చేతుల్లో అనుమానితుల జాబితా?
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది. కానీ పార్టీలోని కొందరు అభ్యర్థులు కాంగ్రెస్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు లీకులు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత పార్టీ మారేందుకు వారు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో అధికారపార్టీకి భయం పట్టుకున్నది. ఫలితంగా అభ్యర్థులపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు టాక్. పార్టీ అభ్యర్థుల్లో సుమారు 15 మంది హస్తం పార్టీకి టచ్‌లో ఉన్నట్టు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సమాచారం.
నిఘా పెంచిన గులాబీ బాస్..
అభ్యర్థులు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఒకవైపు ముమ్మర ప్రచారం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల కదలికలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పేర్ల లిస్టు సైతం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్‌కు చేరినట్టు విశ్వసనీయ సమాచారం.
అభ్యర్థులను మార్చితే పార్టీపై ఎఫెక్ట్?
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో అధికారపార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఆలోచనలు మొదలయ్యాయి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముందస్తుగా వారితో టచ్‌లోకి వెళ్లి బెర్త్ ఖరారు చేసుకునేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు వారిని మారిస్తే అసలుకే ఎసరు వస్తుందని, ఈ ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపై పడుతుందని భావిస్తున్నట్టు టాక్. వారికి ఎన్నికల్లో ప్రజలతోనే చెక్ పెట్టేలా బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
బీఆర్ఎస్ స్ట్రాటెజీకి హస్తం పార్టీ కౌంటర్
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటారు. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను గులాబీ గూటికి చేర్చుకున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలను గెలిపించినా.. వారు బీఆర్ఎస్‌లో చేరుతారనే టాక్‌ను ప్రజల్లో క్రియేట్ చేసింది. దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఈసారి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుగానే టచ్‌లోకి వచ్చేలా చేసుకుంటున్నది హస్తం పార్టీ. బీఆర్ఎస్ తరఫున గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు వారి మధ్య ఒప్పందం సైతం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. కౌంటర్ స్ట్రాటెజీలో రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది.
పార్టీలో ఉంటూనే దెబ్బ కొట్టే ప్లాన్..
మరోవైపు కొందరు బీఆర్ఎస్ లీడర్లు సైతం అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుత అభ్యర్థులు.. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలోని తమకు గుర్తింపు ఇవ్వలేదని కింది స్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు. అలాంటి వారు ఈ ఎన్నికల్లో పార్టీలోనే సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించాలని భావిస్తున్నట్టు సమాచారం.